vachi chududi song lyrics in telugu
వచ్చి చూడుడి మీరోచ్చిచూడుడి
లోకరక్షకుని వచ్చి చూడుడి
రాజుల రాజుకు ప్రభువుల ప్రభువుకు
మనస్సు ఇచ్చి చూడుడి
రక్షణ సువార్తను చెప్పి చూడుడి
రక్షణ సువార్తను చాటి చెప్పుడి
1. దూతలే దిగి వొచ్చింది క్రిస్మస్ పాటలు పాడింది
హ్యాపీ క్రిస్మస్ , మెర్రీ క్రిస్మస్
దేవునికి మహిమ వచ్చింది మానవాలికి సమాధానం వచ్చింది
పరమే పరవశించింది ధరనే పండుగ చేసింది. …రక్షణ…
**క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా
రక్షణ మనకొచ్చేను హల్లెలూయా
ఆ దివికి ఈ భువుకి పరమ క్రిస్మస్
దేవాది దేవుడు ఇచే ధన్య క్రిస్మస్ ఓహో ధన్య క్రిస్మస్
2. చీకటిలో వెలుగు వచ్చింది కాపరులకు శుభ వార్త చెప్పింది
హ్యాపీ క్రిస్మస్ , మెర్రీ క్రిస్మస్
చీకటిలో వెలుగు వచ్చింది కాపరులకు శుభ వార్త చెప్పింది
నక్షత్రం దారి చూపింది
జ్ఞానులకు జ్ఞానోదయం అయింది
కాలమే కళ్లుతెరిచింది
క్రీస్తు శకమై సాక్షం ఇచ్చింది …రక్షణ..