yehovahye na balamu

యెహెూవాయే నా బలము యెహెూవాయే నా శైలము
యెహెూవాయే నా కోటయు యెహెూవాయే నా కేడెము
యెహెూవాయే నా శృంగము యెహెూవాయే నా దుర్గము

నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెను
నా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను
నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను
నా పక్షమున తానేయుండి నన్ను గెలిపించెను

నాకు బలము అనుగ్రహించి నన్ను దృఢపరిచెను
నా శత్రువులకంటె నన్ను బహుగా తానే హెచ్చించెను
నా జనులకు నాకు లోపరచి నన్ను ఘనపరచెను
నా ముందుగా తానే నడచి నన్ను నడిపించెను