Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

యేసు రక్తమే జయము Telugu Christian Songs Lyrics

యేసు రక్తమే జయము జయమురా
సిలువ రక్తమే జయము జయమురా
ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా
తన పక్షము నిలబడిన గెలుపు నీదేరా (2) ||యేసు||

బలహీనులకు బలమైన దుర్గము – ముక్తి యేసు రక్తము
వ్యాధి బాధలకు విడుదల కలిగించును – స్వస్థత యేసు రక్తము (2)
శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం
నీతికి కవచం పరిశుద్ధుని రక్తం (2)
మృత్యువునే గెలుచు రక్తము
పాతాలం మూయు రక్తము
నరకాన్ని బంధించిన
జయశీలి అధిపతి రారాజు యేసయ్యే ||యేసు||

పాపికి శరణం యేసు రక్తము – రక్షణ ప్రాకారము
అపవిత్రాత్మను పారద్రోలును – ఖడ్గము యేసు రక్తము (2)
శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు?
ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు (2)
సాతాన్నే నలగ్గొట్టిన
వాడి తలనే చితగ్గొట్టిన
కొదమ సింహమై మేఘారూఢిగా
తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే ||యేసు||

యేసు రక్తమే జయము Jesus Songs Lyrics in Telugu


యేసు రక్తమే జయము Telugu Christian Songs Lyrics