దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి / Dootha Paata Paadudi christmas song in telugu
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున
భూజనంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెను
ఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడి
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి—
ఊర్ధ్వ లోకమందున – గొల్వగాను శుద్దులు
అంత్య కాలమందున – కన్య గర్భమందున
బుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి—
రావే నీతి సూర్యుడా – రావే దేవా పుత్రుడా
నీదు రాక వల్లను – లోక సౌఖ్య మాయెను
భూ నివాసులందరూ – మృత్యు భీతి గెల్తురు
నిన్ను నమ్ము వారికి – ఆత్మ శుద్ది కల్గును
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
Source from: https://www.youtube.com/watch?v=g4yC0AlKWvw
Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.