మహిమ నీకె ప్రభూ – ఘనత నీకె ప్రభూ – స్తుతీ ఘనత మహిమయు
ప్రభావము నీకె ప్రభూ (2X) – ఆరాధనా, ఆరాధన (2X)
ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే (2X)
1.
సమీపింప రాని – తేజస్సు నందు – వశియించు – అమరుండవే (2x)
శ్రీమంతుడవే – సర్వాధిపతివే – నీ సర్వము నా కిచ్చితివే (2x)
…ఆరాధన…
2.
ఎంతో ప్రేమించి – నాకై ఏతెంచి – ప్రాణము నర్పించితివే (2x)
విలువైన రక్తం – చిందించి నన్ను – విమోచించితివే (2x)
…ఆరాధన…
3.
ఆశ్చర్యకరమైన – నీ వెలుగులోనికి – నను పిలచి – వెలిగించితివే (2x)
నీ గుణాతిశయముల్ – ధరనే ప్రచురింప – ఏర్పరచుకొంటివే (2x)
…ఆరాధన…
4.
రాజులైన యాజక – సమూ్ముగా – ఏర్పరచబడిన వంశమై (2x)
పరిశుద్ధజనమై – నీ సొత్తైన ప్రజగా – నన్ను జేసితివే (2x)
…ఆరాధన

Guru Joseph is a Jesus-follower, Christian song-bird, and Bible word-lover. He aspires to craft words that are deep, impactful, beautiful Kingdom of God, and Christ-centered.
He is a leading Christian author, blogger, YouTuber passionate about people worldwide discovering Jesus Christ through Christian Writing. His content is findable at www.cmportal.in A popular Christian portal with a mission to connect the dots between the Bible and modern life.